Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Sunday, June 27, 2010

705.dEva nI pakshapAtamO tirigE - దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో

3-422

 
Audio link : in raga sindubhairavi
దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో శ్రీవిభుడ నీవేకాదా చిత్తములోనయ్యా దివములు సరియే దినరాత్రులును సరే యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా భవములు సరియే ప్రాణములు సరియే భువి పుణ్యపాపముల భోగము వేరేలయ్యా విని కిందిరి కొకటే విషయాలు నొకరీతే మునిగేటిజాతిబేధము లివేలయ్యా అనయముఁ జూపొక్కటే ఆకలియు నొకటే పెనగేటి గుణములు పెక్కుజాడ లేలయ్యా అంతరాత్మ నీవొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ చింతలు వేవేలైన సిలుగేలయ్యా యింతసేసీ నీమాయ లిందుకే నీశరణంటే కాంతుడ నన్నిందుకే కాచితివి నేడయ్యా dEva nI pakshapAtamO tirigE lOkula veltO SrIvibhuDa nIvEkAdA chittamulOnayyA divamulu sariyE dinarAtrulunu sarE yivala sukhadu@hkhAlu hechchukuMdulElayyA bhavamulu sariyE prANamulu sariyE bhuvi puNyapApamula bhOgamu vErElayyA vini kiMdiri kokaTE vishayAlu nokarItE munigETijAtibEdhamu livElayyA anayamu@M jUpokkaTE Akaliyu nokaTE penagETi guNamulu pekkujADa lElayyA
aMtarAtma nIvokkaDa vanniTA SrIvEMkaTESa chiMtalu vEvElaina silugElayyA yiMtasEsI nImAya liMdukE nISaraNaMTE kAMtuDa nanniMdukE kAchitivi nEDayyA

Sunday, June 20, 2010

704.vedakavO chittamA vivEkiMchi nIvu - వెదకవో చిత్తమా వివేకించి నీవు


Audio link : Smitha Madhav , album : nandakam
3-415 వెదకవో చిత్తమా వివేకించి నీవు అదన తదియ్య సేవ అంతకంటే మేలు చూపులెన్నైనా గలవు సూర్యమండలముదాకా చూపులు శ్రీహరిరూపు చూడ దొరకదు గాని తీపులెన్నైనా గలవు తినదిన నాలికెకు తీపు శ్రీహరిపదార్ధమని కోరదు మాటలెన్నైనా గలవు మరిగితే లోకమందు మాటలు శ్రీహరినామము మరపగ్ వలె తేటలెన్నైనా గలవు తీరని చదువులందు తేటగా రామానుజులు తేరిచె వేదములలో చేట లెన్నైనా గలవు సేసేమంటే భూమి చేతల శ్రీవేంకటేశు సేవ సేయవలెను వ్రాతలెన్నైనా గలవు వనజభవునిముద్ర వ్రాతలు చక్రాంకితాలె వహికెక్కే ముద్రలు vedakavO chittamA vivEkiMchi nIvu adana tadiyya sEva aMtakaMTE mElu chUpulennainA galavu sUryamaMDalamudAkA chUpulu SrIharirUpu chUDa dorakadu gAni tIpulennainA galavu tinadina nAlikeku tIpu SrIharipadArdhamani kOradu mATalennainA galavu marigitE lOkamaMdu mATalu SrIharinAmamu marapaga vale tETalennainA galavu tIrani chaduvulaMdu tETagA rAmAnujulu tEriche vEdamulalO chETa lennainA galavu sEsEmaMTE bhUmi chEtala SrIvEMkaTESu sEva sEyavalenu vrAtalennainA galavu vanajabhavunimudra vrAtalu chakrAMkitAle vahikekkE mudralu

Friday, June 11, 2010

Annamayya Padamandakini - అన్నమయ్య పదమందాకిని


Sujana Ranjani released an album of 108 annamacharya kirtanas composed in 108 different ragas by Sri SattiRaju Venumadhav. The below play list consists of 6 of them, For the book & CD please contact Sitarama Sarma garu (seetaramasarma@gmail.com)



Powered by eSnips.com

Monday, June 07, 2010

703.mariyeMdU gatilEdu manupa - మరియెందూ గతిలేదు మనుప


మరియెందూ గతిలేదు మనుప నీవే దిక్కు జరసి లక్ష్మీశ నీ శరణమే దిక్కు భవసాగరంబులోఁ బడి మునిగిననాకు తివిరి నీనామమనుతేపయే దిక్కు చివికి కర్మంబనెడి చిచ్చు చొచ్చిన నాకు జవళి నాచార్యుకృపాజలధియే దిక్కు ఘనమోహాపాశముల గాలిఁబొయ్యెడినాకు కొనల నీపాదచింతకొమ్మయే దిక్కు కనలి మనసనెడి యాకాసముననున్ననాకు కనుగొనగ నీదాస్య గరుడడే దిక్కు మరిగి సంసారమనెడి మంటికిందటి నాకు ధరభక్తియను బిలద్వారమె దిక్కు యిరవైన శ్రీవేంకటేశ యిన్నిటా నాకు - నరుదైన నీవంతరాత్మవే దిక్కు mariyeMdU gatilEdu manupa nIvE dikku jarasi lakshmISa nI SaraNamE dikku bhavasAgaraMbulO@M baDi muniginanAku tiviri nInAmamanutEpayE dikku chiviki karmaMbaneDi chichchu chochchina nAku javaLi nAchAryukRpAjaladhiyE dikku ghanamOhApASamula gAli@MboyyeDinAku konala nIpAdachiMtakommayE dikku kanali manasaneDi yAkAsamunanunnanaku kanugonaga nIdAsya garuDaDE dikku marigi saMsAramaneDi maMTikiMdaTi nAku dharabhaktiyanu biladwArame dikku yiravaina SrIvEMkaTESa yinniTA nAku - narudaina nIvaMtarAtmavE dikku

Saturday, June 05, 2010

702.OhOhO yaranrO pAri - ఓహోహో యనరో పారి


ఓహోహో యనరో పారి సాహసాన తిరుగరో పారి కోనేటిరాయడు కోరి నిద్రించీ వాడే ఆనకమై జాలీయరో ఆడుబారీ పేనిపట్టి వాకిళ్ళా బీగముద్రలాయ నిడి కానిమ్మని వాయించరో గంట పారి తిరుపణి మణగెను తిరుగరా దెవ్వరికి మరల నెలుగియ్యరో మగపారి పరగ దేవతలెల్ల బడకెళ మున్నారు యిరవాయ సూర్యచంద్రు లెదురు పారి శ్రీవేంకటేశ్వరుడు చిత్తగించీ లోననిదె కోవర మెన్నికరో కోటిపారి ఆవల బంగారు గుదియలు ఘల్లు రనగా తావుల హనుమంతుని తలారి పారి OhOhO yanarO pAri sAhasAna tirugarO pAri kOnETirAyaDu kOri nidriMchI vADE Anakamai jAlIyarO ADubArI pEnipaTTi vAkiLLA bIgamudralAya niDi kAnimmani vAyiMcharO gaMTa pAri tirupaNi maNagenu tirugarA devvariki marala nelugiyyarO magapAri paraga dEvatalella baDakeLa munnAru yiravAya sUryachaMdru leduru pAri SrIvEMkaTESwaruDu chittagiMchI lOnanide kOvara mennikarO kOTipAri Avala baMgAru gudiyalu ghallu ranagA tAvula hanumaMtuni talAri pAri

note : the lyrics in audio is quite different from that in book, but very similar. I am not able to find the exact lyric in the TTD books.

Wednesday, June 02, 2010

701.SRmgAraSIlunaku maMgaLaM - శృంగారశీలునకు మంగళం



Audio link : Composed and sung by Sri Sattiraju Venumadhav
Album : Annamayya padamandakini , by Sujanaranjani , for copies contact Sitaramasharam garu. శృంగారశీలునకు మంగళం సంగీతలోలునకు మంగళం కనకాంబరునకు కరుణాకరునకు మనసిజగురునకు మంగళం మునివరదాతకును దనుజవిజేతకును మనుకులనేతకును మంగళం విధినుత హరికిని విశ్వాధారునకు మధుసంహారికిని మంగళం బుధపోషునకును భోగిశయనునకు మధుభాషణునకు మంగళం బహుమతయతికిని మహిరమాపతికి మహనీయధృతికిని మంగళం విహగవాహనునకు శ్రీవేంకటేశునకు మహితదేవునకు మంగళం SRmgAraSIlunaku maMgaLaM saMgItalOlunaku maMgaLaM kanakAMbarunaku karuNAkarunaku manasijagurunaku maMgaLaM munivaradAtakunu danujavijEtakunu manukulanEtakunu maMgaLaM vidhinuta harikini viSwAdhArunaku madhusaMhArikini maMgaLaM budhapOshunakunu bhOgiSayanunaku madhubhAshaNunaku maMgaLaM bahumatayatikini mahiramApatiki mahanIyadhRtikini maMgaLaM vihagavAhanunaku SrIvEMkaTESunaku mahitadEvunaku maMgaLaM