Audio section under Maintanance

Esnips is down for some time.... Moving audio files to windows SkyDrive: http://sdrv.ms/OPUSw9

Archive.org Embedded Players added for 1-610 kirtanas., Work Under progress for adding Audios for other kirtanas.
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్

Friday, December 31, 2010

733.paTTina paMtamu baluvanavE - పట్టిన పంతము బలువనవే

Audio link : Sri Srirangam Gopalaratnam
పట్టిన పంతము బలువనవే
చుట్టపువరుసలు చూచితిననవే

తానూఁజూచెను తనువూ నాటెను
కానీకానీ కద్దనవే
నానితిఁజెమటల నవ్వుల మునిగితి
పూని యిద్దరికిఁ బోదనవే

మారుమాటాడెను మనసుననిలిచెను
ఆరీ తేరీ నౌననవే
తీరవు పులకలు తెగదిది తమకము
భారము తనపై పడెననవె

కాగిట గూడెను కళలను గరగితి
దాగనేల యికఁ దగుననవే
వీగనైతి శ్రీవేంకటపతి రతి
చేగదేరె నిక జెల్లుబడనవే

paTTina paMtamu baluvanavE
chuTTapuvarusalu chUchitinanavE

tAnU@MjUchenu tanuvU nATenu
kAnIkAnI kaddanavE
nAniti@MjemaTala navvula munigiti
pUni yiddariki@M bOdanavE

mArumATADenu manasunanilichenu
ArI tErI naunanavE
tIravu pulakalu tegadidi tamakamu
bhAramu tanapai paDenanave

kAgiTa gUDenu kaLalanu garagiti
dAganEla yika@M dagunanavE
vIganaiti SrIvEMkaTapati rati
chEgadEre nika jellubaDanavE

Thursday, December 30, 2010

732.chittajaguruDa vO SrInarasiMhA - చిత్తజగురుడ వో శ్రీనరసింహా

Audio link : Sri Balakrishnaprasad
చిత్తజగురుడ వో శ్రీనరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా

సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుడభయమడిగీనదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా

హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా

chittajaguruDa vO SrInarasiMhA
battisEsEru munulu parikiMchavayyA

sakaladEvatalunu jayaveTTuchunnAru
chakitulai dAnavulu samasirade
akalaMkayagu lakshmiyaTu nI toDapai nekke
prakaTamaina nI kOpamu mAnavayyA

tuMburunAradAdulu dorakoni pADEru
aMbujAsanuDabhayamaDigInade
aMbaravIdhi nADEru yachcharalaMdarugUDi
SaMbararipujanaka SAMtamu chUpavayyA

hatti kolichErade yakshulunu gaMdharvulu
chittagiMchu pogaDEru siddhasAdhyulu
sattugA nI dAsulamu SaraNu chochchiti mide
yittala SrIvEMkaTESa yElukonavayyA

Wednesday, December 22, 2010

731.chUchi vachchiti nIvunnachOTiki - చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి

Audio link : P.Suseela
చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా

లలితాంగి జవరాలు లావణ్యవతి ఈకె
కలువకంఠి మంచి కంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుఁబోడిచక్కదనమిట్టిదయ్యా

అలివేణి మిగులనీలాలక శశిభాల
మలయజగంధి మహామానిని యీకె
పెలుచుమరునివిండ్లబొమ్మలది చారుబింబోష్ఠి
కని(లి?)తకుందరద చక్కందనమిట్టిదయ్యా

చెక్కుటద్దములది శ్రీకారకన్న(ర్ణ?)ములది
నిక్కుఁజన్నులరంభోరు నిర్మలపాద
గక్కన శ్రీవేంకటేశ కదిసె లతాహస్త
దక్కె నీకీ లేమ చక్కందన మిట్టిదయ్యా

chUchi vachchiti nIvunnachOTiki tODi techchiti
chEchEta@M beMDlADu chittagiMchavayyA

lalitaMgi javarAlu lAvaNyavati Ike
kaluvakaMThi maMchi kaMbukaMThi
jalajavadana chakrajaghana siMhamadhya
taliru@MbODichakkadanamiTTidayyA

alivENi migulanIlAlaka SaSibhAla
malayajagaMdhi mahAmAnini yIke
peluchumaruniviMDlabommaladi chArubiMbOshThi
kanitakuMdarada chakkaMdanamiTTidayyA

chekkuTaddamuladi SrIkArakanna(rNa?)muladi
nikku@MjannularaMbhOru nirmalapAda
gakkana SrIvEMkaTESa kadise latAhasta
dakke nIkI lEma chakkaMdana miTTidayyA

Tuesday, December 21, 2010

730.pulakala molakala punnamatODanE kUDe - పులకల మొలకల పున్నమతోడనే కూడె



Audio link : Sri Balakrishnaprasad
పులకల మొలకల పున్నమతోడనే కూడె
అలివేణి నీపతితో ఆడవే వసంతము

మాటలు తీగెలు వారె మక్కువలు చిగిరించె
మూటలకొద్దీ నవ్వులు మొగ్గలెత్తెను
వాటపుజవ్వనాలకు వసంతకాలము వచ్చె
ఆటదానవు పతితో ఆడవే వసంతము


చెమటరసములూరి సిగ్గులుపూవకపూచె
తిమురు తరితీపుల తేనెలుబ్బెను
క్రమమున తమకము గద్దియ మదనుండెక్కె
అమర నీ పతితోడ ఆడవే వసంతము

కడుగోరికాకులు కాయముకాయలు గాచె
బడినే కెమ్మోవినీ పండువందెను
ఎడలేక శ్రీవేంకటేశుడిట్టే నిన్ను గూడే
అదరి నీపతితోడీ ఆడవే వసంతము

pulakala molakala punnamatODanE kUDe
alivENi nIpatitO ADavE vasaMtamu

maaTalu tIgelu vaare makkuvalu cigiriMce
mUTalakoddI navvulu moggalettenu
vaaTapujavvanaalaku vasaMtakaalamu vacce
ATadaanavu patitO ADavE vasaMtamu

cemaTarasamulUri siggulupUvakapUce
timuru taritIpula tEnelubbenu
kramamuna tamakamu gaddiya madanuMDekke
amara nI patitODa ADavE vasaMtamu

kaDugOrikaakulu kaayamukaayalu gaace
baDinE kemmOvinI paMDuvaMdenu
eDalEka SrIvEMkaTESuDiTTE ninnu gUDE
adari nIpatitODI aaDavE vasaMtamu

Thursday, December 16, 2010

729.poMderugudunaMduvu bhOginaMduvu - పొందెఱుగుదునందువు భోగినందువు

Audio link : Sri Balakrishnaprasad

పొందెఱుగుదునందువు భోగినందువు నీ -
యందరు సతులకు నేనాకు మడిచిత్తునా

ఎవ్వతెకైనాఁ జనవిచ్చేవు మెచ్చేవు నీ -
నవ్వులకైనాను మన్ననఁ జూచేవు
అవ్వలి యివ్వలి నీ యంగనల వొద్దను
పవ్వళించి వుండగా నే పాదములొత్తుదునా

ఏపున నెక్కడికైనా నేగేవు దాగేవు నీ -
కోపాన నాతోనైనా మేకులు సేసేవు
వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో
నోపికనప్పుడు నీ కూడిగాలు సేతునా

వేడుకలెందుఁ బారవేసేవు నీ -
వాడికచేతలెన్నైనా వన్నె వెట్టేవు
ఈడు లేని తిరువేంకటేశ కూడితివి నన్ను
వాడుచు నీతోడ నేను వాసి చూపగలనా

poMde~rugudunaMduvu bhOginaMduvu nI -
yaMdaru satulaku nEnAku maDichittunA

evvatekainA@M janavichchEvu mechchEvu nI -
navvulakainAnu mannana@M jUchEvu
avvali yivvali nI yaMganala voddanu
pavvaLiMchi vuMDagA nE pAdamulottudunA

Epuna nekkaDikainA nEgEvu dAgEvu nI -
kOpAna nAtOnainA mEkulu sEsEvu
vaipuna nIveMduMDainA vachchina nEnaMtalO
nOpikanappuDu nI kUDigAlu sEtunA

vEDukaleMdu@M bAravEsEvu nI -
vADikachEtalennainA vanne veTTEvu
IDu lEni tiruvEMkaTESa kUDitivi nannu
vADuchu nItODa nEnu vAsi chUpagalanA

Saturday, December 11, 2010

728.adevachche nidevachche achyutusEnApati - అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతి

Audio Archive link : Sri Balakrishnaprasad
అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురులు

గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవుచక్రమదె
మురవైరిపంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కాడై(ఱై) పారరో దానవులు

తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె
యెల్లదేవతరథా లింతటా నవె
కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు

వెండిపైడిగుదె లవె వెంజామరములవె
మెండగు కైవారాలు మించిన వవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె
బడుబండై జజ్జరించి పారరో దైతేయులు

adevachche nidevachche achyutusEnApati
padidikkulaku niTTe pArarO yasurulu

garuDadhwajaMbade ghanaSaMkharavamade
sarusanE vishNudEvuchakramade
muravairipaMpulave muMdarisEnalave
parachi gaggula kADai(~rai) pArarO dAnavulu

tellani goDugulave dEVaduMdubhulu nave
yelladEvatarathA liMtaTA nave
kellurEgI nikki harikIrti bhujamulave
pallapu pAtALAna@M baDarO danujulu

veMDipaiDigude lave veMjAmaramulave
meMDagu kaivArAlu miMchina vave
daMDi SrIvEMkaTapati dADimuTTe nadeyide
baDubaMDai jajjariMchi pArarO daitEyulu

Thursday, December 09, 2010

727.EmigaladiMdu eMtapenaginavRthA - ఏమిగలదిందు ఎంతపెనగినవృథా

ఏమిగలదిందు ఎంతపెనగినవృథా కాముకపు మనసునకు కడమొదలు లేదు వత్తిలోపలినూనె వంటిది జీవనము విత్తుమీదటిపొల్లు విధము దేహంబు బత్తిసేయుటయేమి పాసిపోవుట యేమి పొత్తులసుఖంబులకు పొరలుటలుగాక ఆకాశపాకాశ మరుదైనకూటంబు లోకరంజనము తమలోనిసమ్మతము చాకిమణుగులజాడ చంచలపు సంపదలు చేకొనిననేమి యివి చెదరిననునేమి గాదెబోసినకొలుచు కర్మిసంసారంబు వేదువిడువనికూడు వెడమాయబతుకు వేదనల నెడతెగుట వేంకటేశ్వరునికృపా- మోదంబు వడసినను మోక్షంబు గనుట EmigaladiMdu eMtapenaginavRthA kAmukapu manasunaku kaDamodalu lEdu vattilOpalinUne vaMTidi jIvanamu vittumIdaTipollu vidhamu dEhaMbu battisEyuTayEmi pAsipOvuTa yEmi pottulasukhaMbulaku poraluTalugAka AkASapAkASa marudainakUTaMbu lOkaraMjanamu tamalOnisammatamu chAkimaNugulajADa chaMchalapu saMpadalu chEkoninanEmi yivi chedarinanunEmi gAdebOsinakoluchu karmisaMsAraMbu vEduviDuvanikUDu veDamAyabatuku vEdanala neDateguTa vEMkaTESwarunikRpA- mOdaMbu vaDasinanu mOkshaMbu ganuTa

Saturday, December 04, 2010

726.chUDavayya nIsudati vilAsamu - చూడవయ్య నీసుదతి విలాసము

Audio link : Sri Balakrishnaprasad
ప|| చూడవయ్య నీసుదతి విలాసము | వేడుకకాడవు విభుడవు నీవు ||

చ|| పున్నమివెన్నెల పోగులు వోసి | సన్నపు నవ్వుల జవరాలు |
వన్నెల కుంకుమ వసంత మాడే | ఇన్నిటా కళలతో ఈ మెరుగుబోడి ||

చ|| పాటించి తుమ్మెద పౌజులు దీర్చీ | కాటుక కన్నుల కలికి యిదే |
సూటి జక్కవల జోడలరించీ | నాటకపు గతుల నాభి సరసి ||

చ|| అంగజురథమున హంసలు నిలిపి | కంగులేని ఘన గజగమన |
ఇంగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె | పంగెన సురతపు పల్లవాధరి ||


pa|| cUDavayya nIsudati vilAsamu | vEDukakADavu viBuDavu nIvu ||

ca|| punnamivennela pOgulu vOsi | sannapu navvula javarAlu |
vannela kuMkuma vasaMta mADE | inniTA kaLalatO I merugubODi ||

ca|| pATiMci tummeda paujulu dIrcI | kATuka kannula kaliki yidE |
sUTi jakkavala jODalariMcI | nATakapu gatula nABi sarasi ||

ca|| aMgajurathamuna haMsalu nilipi | kaMgulEni Gana gajagamana |
iMgitapu SrIvEMkaTESa ninnenase | paMgena suratapu pallavAdhari ||


Friday, December 03, 2010

725.harineragani janma madiyElA - హరినెఱగని జన్మ మదియేలా


Audio link 1 : Sri G.NageswaraNayudu
Audio link 2 : Singer unknwon(female)
హరినెఱగని జన్మ మదియేలా ఆ -
సరుస నాతడు లేని చదువేలా

దయ తొలగినయట్టి తపమేలా
భయము లేనియట్టి భక్తేలా
ప్రియము మానినయట్టి పెనగేలా మంచి -
క్రియావిరుద్ధపు కీర్తనలేలా

ఫలములేనియట్టి పనులేలా కడు -
కలిమిలేనియట్టి గర్వమేలా
బలిమిలేని యట్టి పంతమేలా శౌరి -
తలచని యట్టి తనువది యేలా

తన కమరని దొరతనమేలా
చనవు లేని యట్టి సలిగె యేలా
యెనలేని శ్రీవేంకటేశ్వరుని శరణని
మనగలిగిన మీద మరిచింతలేలా


harine~ragani janma madiyElA A -
sarusa nAtaDu lEni chaduvElA

daya tolaginayaTTi tapamElA
bhayamu lEniyaTTi bhaktElA
priyamu mAninayaTTi penagElA maMchi -
kriyAviruddhapu kIrtanalElA

phalamulEniyaTTi panulElA kaDu -
kalimilEniyaTTi garvamElA
balimilEni yaTTi paMtamElA Sauri -
talachani yaTTi tanuvadi yElA

tana kamarani doratanamElA
chanavu lEni yaTTi salige yElA
yenalEni SrIvEMkaTESwaruni SaraNani
managaligina mIda marichiMtalElA


 
Tuned and Sung by  Sri Ronanki VasudevaRao

Wednesday, December 01, 2010

724.polayaluka nidduralu bhOgiMca - పొలయలుక నిద్దురలు భోగించ

Audio :  Vanijayaram
పొలయలుక నిద్దురలు భోగించ దొరకొంటి
అలరవడి మేల్కొనవే అఖిలేశ్వరా

తరుణిమేనపుడే పరితాపసూర్యుడు వొడిచె
వరుస చెలికన్ను కలువలు మొగిచెను
మరుని సాయకపు తామరలు వడి వికసించె
కరుణతో మేల్కొనవే కమలేశ్వరా

కాంత నిట్టుర్పులను గాలియును అగ్నియును
వంతచెమటలవాన వరుణుండును
వింతలుగా నిన్ను సేవింతుమని యున్నారు
పంతమున మేల్కొనవే పరమేశ్వరా

ఒడికముగ జనను ఉదయరాగము వొడమె
వెడలెననదె పలుకు కోకిలరవములు
పడతికూడితివి రతిపరవశంబికనైన
కడగిమేల్కొనవే వేంకటరమణుడా

polayaluka nidduralu bhOgiMca dorakoMTi
alaravaDi mElkonavE akhilESwaraa

taruNimEnapuDE paritaapasUryuDu voDice
varusa celikannu kaluvalu mogicenu
maruni saayakapu taamaralu vaDi vikasiMce
karuNatO mElkonavE kamalESwaraa

kaaMta niTTurpulanu gaaliyunu agniyunu
vaMtacemaTalavaana varuNuMDunu
viMtalugaa ninnu sEviMtumani yunnaaru
paMtamuna mElkonavE paramESwaraa

oDikamuga jananu udayaraagamu voDame
veDalenanade paluku kOkilaravamulu
paDatikUDitivi ratiparavaSaMbikanaina
kaDagimElkonavE vEMkaTaramaNuDaa

Saturday, November 27, 2010

723.vedaki vedaki coppulettucunu - వెదకి వెదకి చొప్పులెత్తుచును


Audio link : Sri Dwaram Lakshmi వెదకి వెదకి చొప్పులెత్తుచును విచారించితిని యిన్నాళ్ళు ఇదివో కంటిని శ్రీవేంకటగిరి యెదుటనె నీ శ్రీపాదములు ఘనతులసీ కాననంబులో కాపురము సేతువు అనగాను అనిశము పద్మవనంబునను ఆడుచునుండుదు వనగాను నిను నీ దాసులుపాడేచోట్ల నెలవై యాలింతు వనగాను ఇనమండలమున నుండుదువనగా ఈమాట విని నేను పైకొని క్షీరాంబుధిలో నెప్పుడు పవ్వళించివుందువు అనగాను వైకుంఠంబున వెలుగొందుచు సర్వము భావించేవనగాను దాకొని జీవులలో ఎప్పుడు అంతర్యామివై వుందువు యనగాను లోకము నీవై వుండుదువు అనగా లోలత నీమాట విని నేను పరమయోగీంద్రులు తలపోయుచునున్న భావముతోనుందువు యనగాను పరిపరివిధముల పుణ్యకర్మము పాయక చరింతువు యనగాను గరిమలనెప్పుడు అలమేల్మంగ కౌగిటిలోవాడవు యనగాను ఇరవుగ శ్రీవేంకటేశుడవనగా యీమాటవిని నేను vedaki vedaki coppulettucunu vicaariMcitini yinnaaLLu idivO kaMTini SrIvEMkaTagiri yeduTane nI SrIpaadamulu ghanatulasI kaananaMbulO kaapuramu sEtuvu anagaanu aniSamu padmavanaMbunanu aaDucunuMDudu vanagaanu ninu nI daasulupaaDEcOTla nelavai yaaliMtu vanagaanu inamaMDalamuna nuMDuduvanagaa ImATa vini nEnu paikoni kShIrAMbudhilO neppuDu pavvaLiMcivuMduvu anagaanu vaikuMThaMbuna velugoMducu sarwamu BAviMcEvanagaanu daakoni jIvulalO eppuDu aMtaryaamivai vuMduvu yanagaanu lOkamu nIvai vuMDuduvu anagaa lOlata nImaaTa vini nEnu paramayOgIMdrulu talapOyucununna bhaavamutOnuMduvu yanagaanu pariparividhamula puNyakarmamu paayaka cariMtuvu yanagaanu garimalaneppuDu alamElmaMga kougiTilOvaaDavu yanagaanu iravuga SrIvEMkaTESuDavanagaa yImaaTavini nEnu

Tuesday, November 23, 2010

722.gurrAla gaTTanitEru - గుఱ్ఱాలఁ గట్టనితేరు


Audio link : Sri S.Venumadhav, from Album, AnnamayyaPadamandakini, To buy this album with 108 kirtanas in 108 ragas, mail to : <seetaramasarma@gmail.com>, Mahidhara SitaramaSarma garu, sujanaranjani గుఱ్ఱాలఁ గట్టనితేరు కొంకకెందైనాఁబారీ విఱ్ఱవీగుచుఁ దీసీని వేడుకతో జీవుడు సరి పిఱుదే రెండుజంటబండికండ్లు సరవితోఁబాదాలు చాపునొగలు గరిమఁజూపులు రెండు గట్టిన పగ్గములు దొరయై దేహరథము తోలీబో జీవుడు పంచమహాభూతములు పంచవన్నె కోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేద్రియరథము పఱపీబో జీవుడు పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్నపానాలు దొబ్బుతెడ్లు యేపున శ్రీవేంకటేశు డెక్కి వీధుల నేగగ కాపాడి నరరథము గడపీబో జీవుడు gu~r~rAla@M gaTTanitEru koMkakeMdainA@MbArI vi~r~ravIguchu@M dIsIni vEDukatO jIvuDu sari pi~rudE reMDujaMTabaMDikaMDlu saravitO@MbAdAlu chApunogalu garima@MjUpulu reMDu gaTTina paggamulu dorayai dEharathamu tOlIbO jIvuDu paMchamahAbhUtamulu paMchavanne kOkalu paMchala chEtulu reMDu baluTekkelu miMchaina SirasE mIdanunna Sikharamu paMchEdriyarathamu pa~rapIbO jIvuDu pApapuNyamulu reMDu pakkanunna chIlalu tOpulayannapAnAlu dobbuteDlu yEpuna SrIvEMkaTESu Dekki vIdhula nEgaga kApADi nararathamu gaDapIbO jIvuDu

Saturday, November 13, 2010

721.dhaaruNipatikini talabaalO bahu - ధారుణిపతికిని తలబాలో



ధారుణిపతికిని తలబాలో బహు దారారతునకు తలబాలో హేమవర్ణునకు ఇందిరాపతికి దామోదరునకు తలబాలో సామజభయరక్షకునకు తులసీ ధామునకు హరికి తలబాలో కలికి రుక్మిణికి కడుతమకించే తలదైవమునకు తలబాలో మలసి సత్యభామకు పతి పంకజ దళనేత్రునకును తలబాలో తిరువేంకటమున దినపెండ్లిగల తరుణులపతికిని తలబాలో ఇరవుగ బాయక ఇందిరనురమున ధరియించు హరికి తలబాలో dhaaruNipatikini talabaalO bahu daaraaratunaku talabaalO
hEmavarNunaku iMdiraapatiki daamOdarunaku talabaalO saamajabhayarakShakunaku tulasI dhaamunaku hariki talabaalO kaliki rukmiNiki kaDutamakiMcE taladaivamunaku talabaalO malasi satyabhaamaku pati paMkaja daLanEtrunakunu talabaalO tiruvEMkaTamuna dinapeMDligala taruNulapatikini talabaalO iravuga baayaka iMdiranuramuna dhariyiMchu hariki talabaalO

Monday, October 04, 2010

720.pRthulahEma kaupInadhara@H - పృథులహేమ కౌపీనధరః


Audio link : Sri LataMangeshkar పృథులహేమ కౌపీనధరః ప్రథితవటుర్మే బలంపాతు సూపాసక్తః శుచిస్సులభః కోపవిదూరః కులాధికః పాపభంజనః పరాత్పరోయం గోపాలో మే గుణం పాతు తరుణః ఛత్రీ దండకమండలు ధరః పవిత్రీ దయాపరః సురాణాం సంస్తుతి మనోహరః స్థిరస్సుధీర్మే ధృతింపాతు త్రివిక్రమః శ్రీతిరువేంకటగిరి నివాసోయం నిరంతరం ప్రవిమల మసృణ కబళప్రియో మే దివ నిశాయాం ధియం పాతు pRthulahEma kaupInadhara@H prathitavaTurmE balaMpAtu sUpAsakta@h Suchissulabha@h kOpavidUra@h kulAdhika@h pApabhaMjana@h parAtparOyam gOpAlO mE guNaM pAtu taruNa@h ChatrI daMDakamaMDalu dhara@h pavitrI dayApara@h surANAm saMstuti manOhara@h sthirassudhIrmE dhRtiMpAtu trivikrama@h SrItiruvEMkaTagiri nivAsOyaM niraMtaram pravimala masRNa kabaLapriyO mE diva niSAyAM dhiyaM pAtu
Dr.Pappu Venugopalarao on this kirtana :
-----------------------------------------------------------
This is one of those fantastic Sanskrit compositions of Annamayya:
Yes it is on Vamana.
The first chranam talks of his first padam on bhumi where he is fond of ghee or food, clean and auspicious, devoid of anger, destroyer of sin , parat para ultimate to the ultimate, gopala should give us virtues.
the second charanam when his second foot occupied the heaven, young, whose has an umbrella, kamandala, sacred and one who steals hearts with his form, when his feet touched the heaven the gods started singing his praise, at that position he was sthria, stable, may he protect my intellect and grasp ( intellect needs balance).
The third feet is trivikrama who occupied the entire universe, the lord of the seven hills, who is fond of sweet food, may he protect my intellect day and night, from being faltering at times.
This is a very subtle and suggestive Sanskrit composition.
one can go on and on interpreting the nuances in this exquisite composition.
-Pappu

Thursday, September 30, 2010

719.mAjahihi dushTamanAyiti - మాజహిహి దుష్టమనాయితి

Archive Audio link : Sri Lata Mangeshkar 
మాజహిహి దుష్టమనాయితి
యోజయ తవపదయుగామృతేన

పరమాత్మన్ మమపామరచిత్తం
చిరం పాపం చికీర్షతి
కరుణానిధే ర్యకారణబంధో
గురుతరాం కృపాం కురు మయి దేవ

అంతర్యామి హరే మదాశా
సంతాప ఏవ సమేధతే
దాంతికరానంతగుణనిధే
భ్రాంతిం వారయ పావన చరిత

నలినోదర మాం నానామోహ
విలసత్కృతీవ విమోహయ
కలిత శ్రీవేంకటనాథత్వం
సలలితం ప్రసాదయ స్వామిన్
mAjahihi dushTamanAyiti
yOjaya tavapadayugAmRtEna
paramAtman mamapAmarachittam
chiraM pApam chikIrshati
karuNAnidhE ryakAraNabaMdhO
gurutarAM kRpAM kuru mayi dEva
aMtaryAmi harE madASA
saMtApa Eva samEdhatE
dAMtikarAnaMtaguNanidhE
bhrAMtim vAraya pAvana charita
nalinOdara mAM nAnAmOha
vilasatkRtIva vimOhaya
kalita SrIvEMkaTanAthatwaM
salalitaM prasAdaya swAmin

Saturday, September 25, 2010

718.iMdukE nIvu vachchitivi - ఇందుకే నీవు వచ్చితివి నీడనే


Audio link : sri Mangalampalli Balamuralikrishna  ఇందుకే నీవు వచ్చితివి నీడనే నేనున్నవాడ విందువంటి నీ గుణాలు వేవేలు గదవే మట్టెలు గల్లురనగ మగువయెందు వోయేవే యిట్టే నీకెదురుచూచి యీడ నున్నాడ కట్టిన నీదవ్వ(ప్ప)టము గజభజించగ నీ దిట్టమాట లివి మాకుఁ దెలియవు గదవే వెదజల్లు వాసనతో వెదకేవెవ్వరినే యిదె నీవు రమ్మనగా నీడ నున్నాడ కదిసి నీ ముంజేతి కంకణాల రవళి కి చదల నీవిన్నపాలు సందడినే వున్నవే కలకల నవ్వులతో కమ్మటి నేమిచూచేవే యెలమి నిన్నుగాచుక యీడా నున్నాడ చెలగి కూడితి నిదె శ్రీవేంకటేశుడ నిన్ను పలుకు పంతము నింతబలువాయఁగదవే iMdukE nIvu vachchitivi nIDanE nEnunnavADa viMduvaMTi nI guNAlu vEvElu gadavE maTTelu galluranaga maguvayemdu vOyEvE yiTTE nIkeduruchUchi yIDa nunnADa kaTTina nIdavva(ppa)Tamu gajabhajiMchaga nI diTTamATa livi mAku@M deliyavu gadavE vedajallu vAsanatO vedakEvevvarinE yide nIvu rammanagA nIDa nunnADa kadisi nI muMjEti kaMkaNAla ravaLi ki chadala nIvinnapAlu saMdaDinE vunnavE kalakala navvulatO kammaTi nEmichUchEvE yelami ninnugAchuka yIDA nunnADa chelagi kUDiti nide SrIVEMkaTESuDa ninnu paluku paMtamu niMtabaluvAya@MgadavE

Tuesday, September 21, 2010

717.erigiti nammiti nitaDu dayAnidhi - ఎఱిగితి నమ్మితి నితడు



 ఎఱిగితి నమ్మితి నితడు దయానిధి మఱగులు మొరగులు మరియిక లేవు వేదోద్ధరణుడు విశ్వరక్షకుడు ఆదిమూర్తి శ్రీఅచ్యుతుడు సోదించి కొలిచితి సుముఖుడై మమ్మేలె యేదెస మాపాల నితడే కలడు పరమపురుషుడు ఆపన్నివారకుడు హరి శాంతుడు నారాయణుడు శరణంటి మితడు చేకొని కాచెను తరవాతి పనులఁ దప్పడితడు హృదయాంతరంగుడు యీశ్వరేశ్వరుడు ఇదివో శ్రీవేంకటేశ్వరుడు వెదకితి మీతడు విడువడు మమ్మిక తుదకును మొదలికి దొరికినవాడు e~rigiti nammiti nitaDu dayAnidhi ma~ragulu moragulu mariyika lEvu vEdOddharaNuDu viSwarakshakuDu AdimUrti SrIachyutuDu sOdiMchi kolichiti sumukhuDai mammEle yEdesa mApAla nitaDE kalaDu paramapuruShuDu ApannivArakuDu hari SAMtuDu nArAyaNuDu SaraNaMTi mitaDu chEkoni kAchenu taravAti panula@M dappaDitaDu hRdayAMtaraMguDu yISwarESwaruDu idivO SrIvEMkaTESwaruDu vedakiti mItaDu viDuvaDu mammika tudakunu modaliki dorikinavADu

Friday, August 20, 2010

716.chadiviti dolli koMta chadivEniMkA goMta - చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత


Audio link : composed and sung by Sri Sattiraju Venumadhav in Sri ragam చదివితి దొల్లి కొంత చదివేనింకా గొంత యెదిరి నన్నెఱగను యెంతైన నయ్యో || వొరుల దూషింతుగాని వొకమారైన నా దురిత కర్మములను దూషించను పరుల నవ్వుదుగాని పలుయోనికూపముల నరకపు నా మేను నవ్వుకోను || లోకుల గోపింతు గాని లోని కామాదులనేటి కాకరి శత్రువుల మీద కడు కోపించ ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువ నాలోని హరి దెలుసుకోలేను || యితరుల దుర్గుణము లెంచి,యెంచి రోతుగాని మతిలో నాయాసలు మానలేను గతిగా శ్రీవేంకటేశుగని బ్రతికిగాని తతి నిన్నాళ్ళ దాకా దలపోయలేను || chadiviti dolli koMta chadivEniMkA goMta yediri nanne~raganu yeMtaina nayyO || vorula dUShiMtugAni vokamAraina nA durita karmamulanu dUShiMchanu parula navvudugAni paluyOnikUpamula narakapu nA mEnu navvukOnu || lOkula gOpiMtu gAni lOni kAmAdulanETi kAkari Satruvula mIda kaDu kOpiMcha AkaDa buddulu cheppi anyula bOdhiMtugAni tEkuva nAlOni hari delusukOlEnu || yitarula durguNamu leMchi,yeMchi rOtugAni matilO nAyAsalu mAnalEnu gatigA SrIvEMkaTESugani bratikigAni tati ninnALLa dAkA dalapOyalEnu ||

Tuesday, August 17, 2010

715.achchapurAla yamunalOpala - అచ్చపురాల యమునలోపల

(sisa)మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొకడు ఒకని కంచములోనిదొడిసి చయ్యనమ్రింగి చూడలేదని నోరు చూపు నొకడు యేగురార్గులు చల్దులెలమి పన్నిదమాడి ఊర్కొని కూర్కొని కుడుచునొక్కడు యిన్ని యుండగ పంచియిడుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు (Ataveladi)కృష్ణు చూడుమనుచు కికురించి పలుమ్రోల మేలిభక్ష్యరాసి మెసగునొకడు నవ్వునొకడు సఖుల నవ్వించు నొకడు ముచ్చటాడు నొకడు మురియునొకడు - pothana bhagavata padyam
Audio link : Sri Sattiraju Venumadhav, composed in Saramga ragam. Album: Annamayya padamandakini అచ్చపురాల యమునలోపల ఇచ్చగించి భుజియించితి కృష్ణ ఊరుగాయలును నొద్దికచద్దులును నారగింపుచును నందరిలో సారె బాలుల సరసాల తోడ కోరి చవులు గొంటివి కృష్ణా ఆకసంబున కాపుర ముఖ్యులు నాకలోకపు నాందులును కైకొని యజ్ఞకర్తయాతడని జోక గొనియాడఁ జొక్కితి కృష్ణా పేయలు లేవు పిలువుడనుచు కోయని నోరఁగూతలును మాయల బ్రహ్మము మతము మెచ్చుచు చేయని మాయలు సేసితి కృష్ణా
mATimATiki vrElu maDichi yUriMchuchu nUrugAyalu dinuchuMDu nokaDu okani kaMchamulOnidoDisi chayyanamriMgi chUDalEdani nOru chUpu nokaDu yEgurArgulu chaldulelami pannidamADi Urkoni kUrkoni kuDuchunokkaDu yinni yuMDaga paMchiyiDuTa nechchelitanamanuchu baMtenaguMDulADunokaDu kRshNu chUDumanuchu kikuriMchi palumrOla mElibhakshyarAsi mesagunokaDu navvunokaDu sakhula navviMchu nokaDu muchchaTADu nokaDu muriyunokaDu
achchapurAla yamunalOpala ichchagiMchi bhujiyiMchiti kRshNa UrugAyalunu noddikachaddulunu nAragiMpuchunu naMdarilO sAre bAlula sarasAla tODa kOri chavulu goMTivi kRshNA AkasaMbuna kApura mukhyulu nAkalOkapu nAMdulunu kaikoni yaj~nakartayAtaDani jOka@M goniyADa@M jokkiti kRshNA pEyalu lEvu piluvuDanuchu kOyani nOra@MgUtalunu mAyala brahmamu matamu mechchuchu chEyani mAyalu sEsiti kRshNA

Tuesday, August 10, 2010

714.AtaDitaDA venna laMtaTa doMgilinADu - ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు

Audio : composed and sung by Sri. Sattiraju Venumadhav in Ganamurthy ragam. వీడటే రక్కసి విగతజీవగ జన్ను - బాలుద్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల - ముఖమందు జూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి - దర్పించి మెక్కిన దావరీడు వీడటే యెలయించి వ్రేతల మానంబు - సూరలాడిన లోకసుందరుండు (పోతన భాగవత పద్యం)
album : Annamayya padamandakini, 108 kirtanas in 108 ragas. for album copies mail to : seetaramasarma@gmail.com ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు యేతులకు మద్దులు రెండిలఁ దోసినాడు యీతడా దేవకిఁగన్న యింద్రనీలమాణికము పూతకిచన్ను దాగి పొదలినాడు యీతడా వసుదేవుని యింటిలో నిధానము చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాడు మేటియైన గొంతి(కుంతి?)దేవి మేనల్లు డీతడా కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతడా వాటమై గొల్లెతలను వలపించినాడు ముగురు వేలుపులకు మూలభూతి యీతడా జిగినావుల పేయలఁ జేరి కాచెను మిగుల శ్రీవేంకటాద్రిమీదిదైవమీతడా తగి రామకృష్ణావతార మందె నిప్పుడు AtaDitaDA venna laMtaTa doMgilinADu yEtulaku maddulu reMDila@M dOsinADu yItaDA dEvaki@Mganna yiMdranIlamANikamu pUtakichannu dAgi podalinADu yITaDA vasudEvuni yiMTilO nidhAnamu chEtanE kaMsuni@M buTTacheMDusEsinADu mETiyaina goMtidEvi mEnallu DItaDA kOTiki@M baDegegAnu koMDa yettenu pATiMchi peMchEyaSOdapAli bhAgya mItaDA vATamai golletalanu valapiMchinADu muguru vElupulaku mUlabhUti yItaDA jiginAvula pEyala@M jEri kAchenu migula SrIvEMkaTAdrimIdidaivamItaDA tagi rAmakRshNAvatAra maMde nippuDu

Tuesday, July 27, 2010

713.navvitinE golletA nAya mavura - నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లడా


Audio link : Sri Mangalampalli Balamuralikrishna నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లడా యెవ్వరేమనిరే నిన్ను నియ్యకుంటిఁ బదరా కానీలే గొల్లెతా కద్దులేరా గొల్లడా ఔనా మఱవకువే అట్టే కానీరా నే నేమంటిని నిన్ను నీకే తెలుసురా మానితినే ఆమాట మంచిదాయఁ బదరా అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లడా కదినెఁ గడుపనులు కల్లగాదురా ఇది నిక్కమటవే ఇంతకంటె నటరా పదరకువే నీవు పలుమారు నేలరా మెచ్చితినే గొల్లెతా మేలు లేరా గొల్లడా కుచ్చితిఁ గాగిట నిన్నేఁ గూడుకొంటిరా యిచ్చకుఁద శ్రీవేంకటేశుడను నేనే యెచ్చరించవలెనా, యెఱుగుదుఁ బదరా navvitinE golletA nAya mavura gollaDA yevvarEmanirE ninnu niyyakuMTi@M badarA kAnIlE golletA kaddulErA gollaDA aunA ma~ravakuvE aTTE kAnIrA nE nEmaMTini ninnu nIkE telusurA mAnitinE AmATa maMchidAya@M badarA adiyEmE golletA aMdukErA gollaDA kadine@M gaDupanulu kallagAdurA idi nikkamaTavE iMtakaMTe naTarA padarakuvE nIvu palumAru nElarA mechchitinE golletA mElu lErA gollaDA kuchchiti@M gAgiTa ninnE@M gUDukoMTirA yichchaku@Mda SrIvEMkaTESuDanu nEnE yechchariMchavalenA, ye~rugudu@M badarA

Thursday, July 22, 2010

712.AnaMda nilaya prahlAda varadA - ఆనంద నిలయ ప్రహ్లాద వరదా



audio link  : Composed by Sri TP Chakrapani garu in nilambari ragam, sung by Sri Anasuya Murthy garu
ప|| ఆనంద నిలయ ప్రహ్లాద వరదా | భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా ||
చ|| పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా | హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా |
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా | భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా ||
చ|| భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా | అవిరళ కేశవ ప్రహ్లాద వరదా |
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా | భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా ||
చ|| బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా | లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా |
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా | బలి వంశ కారణ ప్రహ్లాద వరదా ||


pa|| AnaMda nilaya prahlAda varadA | BAnu SaSi nEtra jaya prahlAda varadA ||
ca|| parama puruSha nitya prahlAda varadA | hari acyutAnaMda prahlAda varadA |
paripUrNa gOviMda prahlAda varadA | Barita kalyANaguNa prahlAda varadA ||
ca|| BavarOga saMharaNa prahlAda varadA | aviraLa kESava prahlAda varadA |
pavamAna nuta kIrti prahlAda varadA | Bava pitAmaha vaMdya prahlAda varadA ||
ca|| bala yukta narasiMha prahlAda varadA | lalita SrI vEMkaTAdri prahlAda varadA |
Palita karuNArasa prahlAda varadA | bali vaMSa kAraNa prahlAda varadA ||



Tuesday, July 20, 2010

711.manasokaTi kOrikalu mAlu - మనసొకటి కోరికలు మాలు గలపుచునుండు


Audio link : Smitha Madhav , charukesi ragam మనసొకటి కోరికలు మాలు గలపుచునుండు తనిసితే నదియ పరతత్వమై నిలుచు కన్నులనియెడి పాపకర్మంబులివి రెండు పన్ని తామెన్నింటిపైనైనఁ బారు మున్నె యివి హరిపాదములమీద నిలిపినను అన్ని పుణ్యంబులును అందునే కలుగు వీనులనియెడి మహావెడఘోరనరకములు ఆని పరనిందలే ఆలింపుచుండు
నానాట యిందులో నారాయణుని కథలు పూని నించిన పుణ్యభోగములే యొసగు నాలుకనియెడి గుహను నాచుఁబా మది యొకటి గాలి అనృతపువిషము గ్రక్కుచుండు యీలీల శ్రీవేంకటేశునామామృతము సోలి నించవే ఆత్మ శుభములే కలుగు manasokaTi kOrikalu mAlu galapuchunuMDu tanisitE nadiya paratatwamai niluchu kannulaniyeDi pApakarmaMbulivi reMDu panni tAmenniMTipainaina@M bAru munne yivi haripAdamulamIda nilipinanu anni puNyaMbulunu aMdunE kalugu vInulaniyeDi mahAveDaghOranarakamulu Ani paraniMdalE AliMpuchuMDu nAnATa yiMdulO nArAyaNuni kathalu pUni niMchina puNyabhOgamulE yosagu nAlukaniyeDi guhanu nAchu@MbA madi yokaTi gAli anRtapuvishamu grakkuchuMDu yIlIla SrIvEMkaTESunAmAmRtamu sOli niMchavE Atma SubhamulE kalugu